Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS 975 NEW COVID CASES AND 6 DEATHS REPORTED IN TELANGANA TODAY SK

తెలంగాణలో 15వేలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..

ఈరోజు నమోదైన కేసుల్లో 774 కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి.

ఈరోజు నమోదైన కేసుల్లో 774 కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,648 శాంపిల్స్ పరీక్షంచగా.. 1,673 మందికి నెగెటివ్ వచ్చింది. 975 మందికి పాజిటివ్ వచ్చింది.

    తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చాక.. రాష్ట్రంలో భారీ మొత్తంలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఒకప్పుడు రోజు 100 కేసులైతేనే.. వామ్మో అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ఏకంగా 900కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 975 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు వచ్చాయి. ఇక రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్ 10, భద్రాద్రిలో 8, వరంగల్ రూరల్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 4, మహబూబ్ నగర్‌లో 3, నల్గొండ, యాదాద్రి, కామారెడ్డిలో 2 చొప్పున, సిద్దిపేట, అసిఫాబాద్, గద్వాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 410 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి.

    తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,582 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 253 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,559 యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో 2,648 శాంపిల్స్ పరీక్షంచగా.. 1,673 మందికి నెగెటివ్ వచ్చింది. 975 మందికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఇప్పటి వరకు 85,106 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
    వైద్యఆరోగ్యశాఖ ప్రకటన
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు