హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

కరోనా వైరస్‌‌తో పోరాడుతూ 1491 మంది కోలుకున్నారు. 88 మంది మరణించారు. ప్రస్తుతం 1213 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు భారీ మొత్తంలో కొత్త కేసులు వస్తున్నాయి. సోమవారం 94 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 79, రంగారెడ్డిలో 3, మేడ్చల్‌లో 3, మెదక్ 2, సంగారెడ్డి 2, నల్గొండ 2, మహబూబాబాద్ 1, జనగాం 1, పెద్దపల్లిలో 1 కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వారు, వలస కార్మికుల్లో సోమవారం ఎవరికీ కరోనా నిర్ధారణ కాలేదు. సోమవారం మరో ఆరుగురు కరోనా రోగులు మరణించారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,792కి చేరింది. వీరిలో 434 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు.

  రాష్ట్రం నమోదైన మొత్తం కేసుల్లో.. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ 1491 మంది కోలుకున్నారు. 88 మంది మరణించారు. ప్రస్తుతం 1213 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, భద్రాద్రి, అసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

  తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్

  First published:

  Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు