Coronavirus : కరోనా సోకిన భార్యకు దగ్గరుండి ఫుడ్ పెడుతున్న 87 ఏళ్ల భర్త... వైరల్ వీడియో

Coronavirus | Covid 2019 : కరోనా వైరస్ సోకిందని తెలిస్తే చాలు... డాక్టర్లే ఆ వ్యక్తిని ప్రత్యేక వార్డులో ఉంచేస్తారు. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా చేస్తారు. కానీ ఆ భర్త అందుకు ఒప్పుకోలేదు. తాను చనిపోయినా పర్వాలేదంటున్నాడు.

news18-telugu
Updated: February 16, 2020, 10:49 AM IST
Coronavirus : కరోనా సోకిన భార్యకు దగ్గరుండి ఫుడ్ పెడుతున్న 87 ఏళ్ల భర్త... వైరల్ వీడియో
Coronavirus : కరోనా సోకిన భార్యకు దగ్గరుండి ఫుడ్ పెడుతున్న 87 ఏళ్ల భర్త... వైరల్ వీడియో (Image credit: Twitter)
  • Share this:
Coronavirus 2020 | Covid 2019 : 87 ఏళ్ల ఓ ముసలాయన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరస్ అయ్యింది. ఆ వీడియోలో ఆ పెద్దాయన... కరోనా వైరస్ సోకిన తన భార్యకు తనే స్వయంగా ఆహారం పెడుతున్నాడు. సహజంగా కరోనా వైరస్ సోకిన పేషెంట్ల దగ్గరకు బంధువుల్ని, కుటుంబ సభ్యుల్నీ డాక్టర్లు వెళ్లనివ్వరు. ఎందుకంటే ఆ వైరస్ వాళ్లకూ సోకుతుందనే భయం. ఐతే... ఆ ముసలాయన మాత్రం తనకూ వైరస్ సోకినా పర్వాలేదంటూ... తన భార్య దగ్గరే ఉంటూ ఆమెకు సపర్యలు చేస్తున్నాడు. విషాదకరమైన విషయమేంటంటే... ఆయనకూ కరోనా వైరస్ సోకింది. అందుకే ఈ 18 సెకండ్ల వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. నెటిజన్ల హార్ట్స్ బ్రేకవుతున్నాయి. డాక్టర్లు ఎంత చెప్పినా వినకుండా అతను తన భార్య దగ్గరకు వెళ్లి సపర్యలు చేశాడు. తాను చనిపోయినా పర్వాలేదంటున్నాడు. తనతోపాటూ ఇన్నాళ్లూ జీవించిన తన భార్యను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదల్లేనని చెబుతుంటే... డాక్టర్లు కూడా ఏమీ చెయ్యలేకపోయారు.


ప్రస్తుతం ఈ వీడియోని 1.24లక్షల మంది చూశారు. 3వేల మందికి పైగా లైక్ చేశారు. 700 మంది రీట్వీట్ చేశారు. చాలా మంది జాలి పడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ముసలి దంపతులు ఇద్దరూ త్వరగా రికవరీ కావాలనీ, వ్యాధి నుంచీ కోలుకొని హాయిగా జీవించాలని కోరుకుంటున్నారు.




కొంతమంది ట్విట్టర్ యూజర్లు చైనా ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. ఇలాంటి ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడటంపై ఆవేదన చెందుతున్నారు.




చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ వల్ల ఇప్పటికే 1600 మందికి పైగా చనిపోయారు. మరో 60 వేల మందికి పైగా వ్యాధితో బాధపడుతున్నారు. జనవరి 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం 28 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. తాజాగా ఫ్రాన్స్‌లో చైనాకు చెందిన ఓ వ్యక్తి చనిపోయారు. కరోనా వైరస్ వల్ల ఫ్రాన్స్‌లో సంభవించిన మొదటి మరణం ఇది. మన దేశంలోని కేరళలో కరోనా సోకిన ముగ్గురూ కోలుకుంటుండటం ఆనందకర విషయం.
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు