ఏపీపై కరోనా పంజా..143కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టింగ్‌ సెంటర్ల ఉండగా.. అదనంగా గుంటూరు, కడపలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

news18-telugu
Updated: April 2, 2020, 6:54 PM IST
ఏపీపై కరోనా పంజా..143కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉదయం బులెటిన్‌లో 21, మధ్యాహ్నం 3, ఇక సాయంత్రం 8 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తంగా ఇవాళ ఒక్క రోజే 32 కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 143కి చేరింది. మరో 409 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 23 మందికి కరోనా సోకింది. ఇక నెల్లూరులో 21, గుంటూరులో 20, ప్రకాశంలో 17, కడపలో 16, పశ్చిమ గోదావరి 14, విశాఖపట్టణంలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీ ప్రభుత్వ పత్రికా ప్రకటన

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టింగ్‌ సెంటర్ల ఉండగా.. అదనంగా గుంటూరు, కడపలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 4 నుంచి అక్కడ కరోనా పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆ కేంద్రాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యం రోజుకు 140 నుంచి 570కి పెరగనుంది. ఇక విశాఖపట్టణంలో మరో టెస్టింగ్ సెంటర్ కూడా సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.

First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading