గుంటూరులో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో 8 మందికి పాజిటివ్

గుంటూరులో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో 8 మందికి పాజిటివ్

ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు నగరంలో ఉన్నట్లు చెప్పారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉదయం ప్రకటించిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు వైరస్ విస్తరించిది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి.

  • Share this:
    ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. విజయవాడ, విశాఖతో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో మరో 8 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. దాంతో జిల్లా మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. ఇందులో 27 మంది కరోనా బాధితులు ఒక్క గుంటూరు నగరంలో ఉన్నట్లు చెప్పారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉదయం ప్రకటించిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు వైరస్ విస్తరించిది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదుగురు బాధితులు వ్యాధి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. మరో ముగ్గురు చనిపోయారు. ఐతే తాజాగా గుంటూరులో నమోదైన 8 కేసులను తాజా బులెటిన్‌లో ప్రకటించాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు