ముంబైలో ఓకే వార్డులో 70 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్.. పోలీసుల వేట

మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 7,87,419 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 1,35,796 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 17.24 శాతంగా ఉంది.

news18-telugu
Updated: June 23, 2020, 4:26 PM IST
ముంబైలో ఓకే వార్డులో 70 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్.. పోలీసుల వేట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్యుల చికిత్సపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. కరోనా రోగులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై నుంచి మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. మలాద్‌లోని పీ-నార్త్ వార్డులో ఏకంగా 70 మంది కరోనా రోగులు అదృశ్యమయ్యారు. గత మూడు నెలల నుంచి ఇప్పటి వరకు 70 మంది కనిపించడం లేదని బీఎంసీ అధికారులు వెల్లడించారు. వారిని గుర్తించాలని ఇప్పటికే పోలీసులను ఆదేశించారు.

ఐతే వారిలో చాలా మంది తప్పుడు చిరునామాలు ఇచ్చారు. కొందరు ఇళ్లకు తాళాలు వేసిఉన్నాయి. ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో IMEI నెంబర్ ఆధారంగా వారిని గుర్తించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రోగులను ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా మలాద్ ప్రాంతంలో కరోనా తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో కరోనా రోగుల రికార్డులను చెక్ చేయగా.. ఈ విషయం తెలిసింది. అదృశ్యమైన వారి వల్లే ఈ ప్రాంతంలో కరోనా విస్తరించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఐతే ఆస్పత్రుల నుంచి కరోనా పేషెంట్లు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతుంటే ఏం చేస్తున్నారని.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాగా, మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో సోమవారం రాత్రి వరకు 1,35,796 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 67,706 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 6283 మంది మరణించారు. మహారాష్ట్రలో 61,793 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 7,87,419 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 1,35,796 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 17.24 శాతంగా ఉంది. ఇక మరణాలు రేటు 4.63గా ఉన్నట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,586కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 3737 మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 34,121 మంది కరోనా పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 29720 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: June 23, 2020, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading