HOME »NEWS »Corona vilayatandavam »coronavirus 7 days nationawide lockdown for 7 days in bhutan from wednesday sk

Lock Down: నేటి నుంచి మళ్లీ లాక్‌డౌన్.. మన పొరుగుదేశం సంచలన నిర్ణయం

Lock Down: నేటి నుంచి మళ్లీ లాక్‌డౌన్.. మన పొరుగుదేశం సంచలన నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం

Bhutan Lock down: భూటాన్‌లో ఇప్పటి వరకు 479 మంది కోవిడ్ బారినపడ్డారు. వీరిలో ఇప్పటికే 430 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరో 49 మందికి చికిత్స కొనసాగుతోంది.

  • Share this:
    కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోదనుకున్న వేళ.. కోవిడ్ రక్కసి మళ్లీ రంకెలేస్తోంది. కొత్త కేసుల సంఖ్య పెరగడంతో పాటు బ్రిటన్‌లో కొత్త మ్యుటేషన్ రావడంతో.. పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. తాజాగా మన పొరుగుదేశం భూటాన్‌లో ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఇవాళ్టి నుంచే ఇది అమల్లోకి వస్తుంది. కరోనా నేపథ్యంలో భూటాన్‌లో జిల్లాల మధ్య కొన్ని రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా థింపు, పారో, లామోజింఖాలో కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది.

    భూటాన్ వ్యాప్తంగా అత్యవసర సేవలకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు మాత్రం తెరిచి ఉంటాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, వ్యాపార సముదాయాలన్నీ మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. నిత్యావసర సరుకులు, మందులు, యానిమల్ ఫీడ్ వంటి సరుకు రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని సూచించింది.




    కాగా, భూటాన్‌లో ఇప్పటి వరకు 479 మంది కోవిడ్ బారినపడ్డారు. వీరిలో ఇప్పటికే 430 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరో 49 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా వలన భూటాన్‌లో ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదు. ఐతే కొన్ని రోజులుగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఏడు రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
    Published by:Shiva Kumar Addula
    First published:December 23, 2020, 07:35 IST

    टॉप स्टोरीज