హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. మరో ముగ్గురు మృతి

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. మరో ముగ్గురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డిలో 1 కేసులు ఉన్నాయి. మరో 15 మంది వలస కార్మికులు, 18 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో మరో వ్యక్తికి కరోనా సోకింది.

    తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సోమవారం 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం మరో 72 బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ముగ్గురు చనిపోయారు. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డిలో 1 కేసులు ఉన్నాయి. మరో 15 మంది వలస కార్మికులు, 18 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో మరో వ్యక్తికి కరోనా సోకింది. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1920 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,164 మంది కోలుకోగా.. 56 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 700 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

    వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి,నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్ ఉన్నాయి.

    వైద్యఆరోగ్యశాఖ బులెటిన్

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona, Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు