మహారాష్ట్రలో లక్ష దాటిన కరోనా డిశ్చార్జిల సంఖ్య.. భారీగా కొత్త కేసులు

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,699కి చేరింది.

news18-telugu
Updated: July 2, 2020, 10:01 PM IST
మహారాష్ట్రలో లక్ష దాటిన కరోనా డిశ్చార్జిల సంఖ్య.. భారీగా కొత్త కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 6330 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 8018 మంది డిశ్చార్జి కాగా.. మరో 125 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 186626కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 101172మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8178 మంది మరణించారు. మహారాష్ట్రలో 77260 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 10,20,368 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 1,86,626 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 18.29 శాతంగా ఉంది. ఇక మరణాలు రేటు 4.38శాతంగా ఉన్నట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,699కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 4,689మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 50691 మంది కరోనా పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 25311 కరోనా యాక్టివ్ కేసులున్నాయి
First published: July 2, 2020, 9:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading