మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 5,537 కొత్త కేసులు

మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 9,92,723 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 1,80,298 మందికి పాజిటివ్ వచ్చింది.

news18-telugu
Updated: July 1, 2020, 10:52 PM IST
మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 5,537 కొత్త కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో విలయ తాండవం చేస్తోంది. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 5,537 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 2,243 మంది డిశ్చార్జి కాగా.. మరో 198 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 1,80,298కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 93,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8,053 మంది మరణించారు. మహారాష్ట్రలో 79,075 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 9,92,723 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 1,80,298 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 18.16 శాతంగా ఉంది. ఇక మరణాలు రేటు 4.47శాతంగా ఉన్నట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,145కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 4,631 మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 44,791 మంది కరోనా పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 29,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి
First published: July 1, 2020, 10:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading