మహారాష్ట్రలో మరణ మృదంగం.. 9వేలు దాటిన కరోనా మరణాలు

మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 11,35,447 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 2,11,987 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 18.67 శాతంగా ఉంది.

news18-telugu
Updated: July 6, 2020, 9:39 PM IST
మహారాష్ట్రలో మరణ మృదంగం.. 9వేలు దాటిన కరోనా మరణాలు
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5368 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ 3,522 మంది డిశ్చార్జి కాగా.. మరో 204 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 2,11,987కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,15,262మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 9,026 మంది మరణించారు. మహారాష్ట్రలో 87681 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 11,35,447 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 2,11,987 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 18.67 శాతంగా ఉంది. ఇక మరణాలు రేటు 4.26 శాతంగా ఉన్నట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85724కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 4938 మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 57,152 మంది కరోనా పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 23,624కరోనా యాక్టివ్ కేసులున్నాయి
Published by: Shiva Kumar Addula
First published: July 6, 2020, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading