కరోనా వార్డులో 5 పిల్లులు మృతి.. వైరస్ వల్లే చనిపోయాయా?

కేంద్ర వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. కేరళలో ఇప్పటి వరకు 336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 70 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

news18-telugu
Updated: April 8, 2020, 3:12 PM IST
కరోనా వార్డులో 5 పిల్లులు మృతి.. వైరస్ వల్లే చనిపోయాయా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా మనుషులను కబళిస్తున్న కరోనావైరస్ జంతువులపై మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. జంతువులకు ఈ వ్యాధి సోకదేమోనని మొన్నటి వరకు అందరూ అనుకున్నారు. కానీ అమెరికాలోని బ్లాంక్స్ జూలో ఓ పులికి కరోనా సోకడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల నదియా అనే ఆడపులికి పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా కేరళలోని కాసర్‌గడ్‌లో నాలుగు పిల్లులు మృత్యువాతపడ్డాయి. అవి ఇళ్లల్లోనో.. రోడ్ల మీదో చనిపోతే.. పెద్ద విషయమేమీ కాదు. కానీ కోవిడ్-19 ఆస్పత్రిలో అవి కన్నుమూశాయి. ఏకంగా నాలుగు పిల్లులు చనిపోవడంతో వైద్యాధికారుల దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పిల్లుల మృత కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్‌లో ఉన్న నేషనల్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీస్ ల్యాబ్‌కు తరలించారు. పిల్లులు కరోనా వైరస్‌తోనే చనిపోయాయా? లేదా? అనేది రిపోర్టులు వచ్చిన తర్వాతే తెలియనుంది.

కేంద్ర వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. కేరళలో ఇప్పటి వరకు 336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 70 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు వ్యాధి బారినపడి చనిపోయారు. రాష్ట్రంలో కాసర్‌గడ్ జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అదే జిల్లాలో 5 పిల్లులు అనుమానస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో పెంపుడు జంతువుల విషయంలోనూ సామాజిక దూరం పాటించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading