షాకింగ్.. ఢిల్లీ ఎయిమ్స్‌లో 480 మందికి కరోనా పాజిటివ్

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో పనిచేసే నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీపీఈ కిట్లలో ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత లేదని ఆరోపిస్తున్నారు.

  • Share this:
    భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజకు సుమారు 9 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం కరోనా బారినపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఏకంగా 480 మందికి కరోనా సోకినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సులు, 74 మంది సెక్యూరిటీ గార్డులు, 75 మంది ఆస్పత్రి అటెండర్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది, 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. మిగిలిన వారు ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో పనిచేసే నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీపీఈ కిట్లలో ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత లేదని ఆరోపిస్తున్నారు.

    కాగా, దేశ రాజధాని ఢిల్లీపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు 23,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 9,542 మంది కోలుకోగా.. 606 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 13,497 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: