హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణలో మరో నలుగురు మృతి.. కొత్త కేసులు ఎన్నంటే..

తెలంగాణలో మరో నలుగురు మృతి.. కొత్త కేసులు ఎన్నంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇవాళ మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం 9 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. నలుగురు చనిపోయారు.

    తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం 9 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. నలుగురు చనిపోయారు. ఇవాళ GHMC పరిధిలో 34, మరో 8 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 77 మంది వలస కార్మికులు కరోనా బారినపడ్డారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1634 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,011 మంది కోలుకోగా.. 38 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 585 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

    వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఐతే రాష్ట్రంలో GHMCతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేరుకున్న తెలంగాణ వలస కార్మికుల నుంచే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చినప్పటికీ.. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన నిబంధనలు అమలవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడి ప్రజలకు ప్రభుత్వమే నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేస్తుందని తెలిపారు.

    గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు:

    కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి,నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్.

    వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Telangana

    ఉత్తమ కథలు