హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. మరో 47 మంది కరోనా

తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. మరో 47 మంది కరోనా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1414కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 939 మంది కోలుకోగా.. 34 మంది మరణించారు.

    తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం 13 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఎవరూ చనిపోలేదు. ఇవాళ GHMC పరిధిలో 40, రంగారెడ్డిలో 5 కేసులు, మరో ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకింది. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1414కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 939 మంది కోలుకోగా.. 34 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 428 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

    వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఐతే రాష్ట్రంలో GHMCతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేరుకున్న తెలంగాణ వలస కార్మికుల నుంచే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు వలస కార్మికులపై ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం. ప్రత్యేక రైళ్లు, శ్రామిక్ రైళ్లలో వచ్చిన వారిని స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా క్వారంటైన్ సెంటర్‌కు పంపిస్తున్నారు. అంతేకాదు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

    గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు:

    కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్.

    వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona virus, Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు