హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణలో మరో ఇద్దరు మృతి.. కొత్త కరోనా కేసులు ఎన్నంటే..

తెలంగాణలో మరో ఇద్దరు మృతి.. కొత్త కరోనా కేసులు ఎన్నంటే..

వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

  తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే 117 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. మరో ఇద్దరు చనిపోయారు. కొత్త కేసుల్లో 31 హైదరాబాద్‌లో నమోదవగా.. మరో 10 మంది వలస కార్మికులు ఉన్నారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1367కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 939 మంది కోలుకోగా.. 34 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 394 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

  వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఐతే రాష్ట్రంలో GHMCతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేరుకున్న తెలంగాణ వలస కార్మికుల నుంచే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు వలస కార్మికులపై ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం. ప్రత్యేక రైళ్లు, శ్రామిక్ రైళ్లలో వచ్చిన వారిని స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా క్వారంటైన్ సెంటర్‌కు పంపిస్తున్నారు.

  గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు:

  కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్.

  తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన

  First published:

  Tags: Corona virus, Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు