మహారాష్ట్రలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 3827 కేసులు నమోదు..

మహారాష్ట్రలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 3827 కేసులు నమోదు..

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,139కి చేరింది.

  • Share this:
    మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ కూడా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,827 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 1935 మంది డిశ్చార్జి కాగా.. మరో 142 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 1,24,331కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 62,773 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 5893 మంది మరణించారు.


    మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,139కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 3425 మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 32,264 మంది కరోనా పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 28442 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
    First published: