హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణలో కరోనా విజృంభణ.. మరో ఐదుగురు మృతి..

తెలంగాణలో కరోనా విజృంభణ.. మరో ఐదుగురు మృతి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బుధవారం మరో 23 బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఐదుగురు చనిపోయారు.

  తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం మరో 23 బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఐదుగురు చనిపోయారు. ఇవాళ GHMC పరిధిలో 26, రంగారెడ్డిలో 2 కేసులతో పాటు మరో 10 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99 మంది వలస కార్మికులు కరోనా బారినపడ్డారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1699 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,036 మంది కోలుకోగా.. 45 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 618 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

  వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి,నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్ ఉన్నాయి.

  వైద్యఆరోగ్యశాఖ ప్రకటన

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19, GHMC, Telangana

  ఉత్తమ కథలు