మహారాష్ట్రలో కరోనా బీభత్సం.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62875కి చేరింది.

news18-telugu
Updated: June 18, 2020, 9:18 PM IST
మహారాష్ట్రలో కరోనా బీభత్సం.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇవాళ కూడా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,752 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 1672 మంది డిశ్చార్జి కాగా.. మరో 100 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 120504కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 60838 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 5751 మంది మరణించారు.



మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62875కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 3311 మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 31856 మంది కరోనా పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 27700 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: June 18, 2020, 9:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading