మహారాష్ట్రలో ఒక్క రోజే 3,721 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 7,87,419 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 1,35,796 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 17.24 శాతంగా ఉంది.

news18-telugu
Updated: June 22, 2020, 9:24 PM IST
మహారాష్ట్రలో ఒక్క రోజే 3,721 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇవాళ కూడా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,721 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 1962 మంది డిశ్చార్జి కాగా.. మరో 62 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 1,35,796కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 67,706 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 6283 మంది మరణించారు. మహారాష్ట్రలో 61,793 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 7,87,419 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 1,35,796 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 17.24 శాతంగా ఉంది. ఇక మరణాలు రేటు 4.63గా ఉన్నట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,586కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 3737 మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 34,121 మంది కరోనా పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 29720 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: June 22, 2020, 9:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading