ఏపీలో కొత్తగా 33 కరోనా కేసులు.. 60కి చేరిన మరణాలు

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 111 మందికి కరోనా సోకిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 245 మంది కరోనా బారినపడ్డారని వెల్లడించింది.

news18-telugu
Updated: May 29, 2020, 3:32 PM IST
ఏపీలో కొత్తగా 33 కరోనా కేసులు.. 60కి చేరిన మరణాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మరో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11,638 శాంపిల్స్‌ను పరీక్షించగా 33 కొత్త కేసులు బయటపడ్డాయని ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 79 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక వ్యాధి తీవ్రత ఎక్కువై కర్నూలుకు చెందిన రోగి మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 2874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2037 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా...60 మంది మరణించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 777 మంది చికిత్స పొందుతున్నారు.

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 111 మందికి కరోనా సోకిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వారిలో ఎవరూ డిశ్చార్జి కాలేదు. ఇక పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో  245 మంది కరోనా బారినపడ్డారని వెల్లడించింది.

First published: May 29, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading