24 గంటల్లో 3,214 కొత్త కేసులు.. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68410కి చేరింది.

news18-telugu
Updated: June 23, 2020, 9:40 PM IST
24 గంటల్లో 3,214 కొత్త కేసులు.. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో విలయ తాండవం చేస్తోంది. రోజుకు 3వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,214 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 1925 మంది డిశ్చార్జి కాగా.. మరో 248 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 1,39,010కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 69,631 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 6531 మంది మరణించారు. మహారాష్ట్రలో 62,833 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. మహారాష్ట్రలో ఇఫ్పటి వరకు 8,02,775 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 1,39,010 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 17.31 శాతంగా ఉంది. ఇక మరణాలు రేటు 4.69గా ఉన్నట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68410కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 3844 మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 34,576 మంది కరోనా పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 29,982 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: June 23, 2020, 9:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading