ఢిల్లీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 3వేల కొత్త కేసులు

ఢిల్లీలో ఇవాళ 18,105 మందికి కరోనా టెస్ట్‌లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 3,70,014 టెస్ట్‌లు చేశారు.

news18-telugu
Updated: June 21, 2020, 7:56 PM IST
ఢిల్లీలో  కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 3వేల కొత్త కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. కొత్త కేసుల పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. ఢిల్లీ వైద్యఆరోగ్యశాఖ విడుదలచేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 3వేల కొత్త కేసులు నమోదయ్యాయి. 1719 మంది డిశ్చార్జి కాగా.. 63 మంది మరణించారు. తాజా లెక్కలతో కలిపి ఢిల్లీలో మొత్తం
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,746కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 33,013 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2175 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 24,558 యాక్టివ్ కేసులున్నాయి.



ఢిల్లీలో ఇవాళ 18,105 మందికి కరోనా టెస్ట్‌లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 3,70,014 టెస్ట్‌లు చేశారు. ఢిల్లీలో ప్రతి 10 లక్షల మందిలో 19,474 కరోనా పరీక్షల చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఢిల్లీ వ్యాప్తంగా 261 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. కాగా, ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ప్లాస్మా థెరపీ తర్వాత ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో ఏకంగా 154136 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలు దాటి... 410461కి చేరింది. నిన్న 306 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 13254కి చేరింది. ఇండియాలో కరోనా వల్ల ఒకే రోజు ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 13925 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసుల సంఖ్య 227755కి చేరింది. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 169451గా ఉంది.
First published: June 21, 2020, 7:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading