ఏపీలో మరో ముగ్గురికి కరోనా.. మొత్తం 91 కేసులు ఢిల్లీ నుంచే..

ఇప్పటి వరకు నాలుగు టెస్టింగ్‌ సెంటర్ల ఉండగా.. అదనంగా గుంటూరు, కడపలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 4 నుంచి అక్కడ కరోనా పరీక్షలు ప్రారంభమవుతాయి.

news18-telugu
Updated: April 2, 2020, 4:41 PM IST
ఏపీలో మరో ముగ్గురికి కరోనా.. మొత్తం 91 కేసులు ఢిల్లీ నుంచే..
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ 21 కొత్త కేసులు నమోదగా.. తాజాగా మరో ముగ్గురికి వైరస్ సోకినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంటే ఇవాళ ఒక్కరోజే ఇప్పటి వరకు 24 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 135కి చేరింది. ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనావైరస్ సోకడం వల్లే రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. నిజాముద్దీన్‌లోని మర్కత్ భవన్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ సమావేశానికి ఏపీ నుంచి 1085 మంది హాజరైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 785 మంది గుర్తించి శాంపిల్స్ టెస్ట్‌ చేయగా.. 91 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారిలో 16 శాతం మందికి కరోనా వైరస్ సోకింది.  ఇక మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది ఏపీ ప్రభుత్వం.

ఏపీలో మొత్తం 135 పాజిటివ్ కేసులు నమోదవగా... ఇందులో 91 మంది ఢిల్లీకి వచ్చిన వారే ఉండడం గమనార్హం. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టింగ్‌ సెంటర్ల ఉండగా.. అదనంగా గుంటూరు, కడపలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 4 నుంచి అక్కడ కరోనా పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆ కేంద్రాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యం రోజుకు 140 నుంచి 570కి పెరగనుంది. ఇక విశాఖపట్టణంలో మరో టెస్టింగ్ సెంటర్ కూడా సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.

First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading