తెలంగాణ మరో 27 కొత్త కేసులు.. మొత్తం 27శాతం రోగులు డిశ్చార్జి

ఫ్రతీకాాత్మక చిత్రం

తెలంగాణలో మొత్తం 970 మంది కరోనా బారినపడగా.. 262 మంది కోలుకున్నారు. అంటే 27 శాతం రోగులు కోలుకున్నారన్న మాట.

 • Share this:
  తెలంగాణలో కరోనా కేసులు మరింతగా పెరిగాయి. గురువారం 27 కొత్త కేసులు నమోదవగా.. ఒకరు చనిపోయారు. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 13 మంది, గద్వాలలో 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయింది. ఇక జనగామ, కొమరం భీమ్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఆస్పత్రుల నుంచి 58 మంది డిశ్చార్జి అయ్యారని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 970కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 262 మంది కోలుకున్నారు. మొత్తంగా 25 మంది మరణించారు. రాష్ట్రంలో 693 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఈటల రాజేందర్ చెప్పారు.
  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్

  ఇక గత 14 రోజుల్లో నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కరు కూడా కరోనా బారినపడలేదు. రాష్ట్రంలో 9 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని..కరోనా పరీక్షలు మరింత వేగవంతమవుతాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దేశవ్యాప్త మరణాల రేట్‌ (3.1%)తో పోల్చితే తెలంగాణ (2.6%) మెరుగైన స్థానంలో ఉందని ఆయన చెప్పారు. దేశవ్యాప్త రికవరీ రేటు 19.9% గా ఉంటే తెలంగాణ 22 శాతంతో మెరుగైన స్థానంలో ఉందన్నారు ఈటెల. తెలంగాణలో మొత్తం 970 మంది కరోనా బాధితుల్లో 262 మంది కోలుకోవడంతో.. ఇప్పటి వరకు 27 శాతం రోగులు కోలుకున్నారని అర్థం చేసుకోవచ్చు.
  Published by:Shiva Kumar Addula
  First published: