తెలంగాణలో 154కి పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే 27

ఇప్పటి వరకు 17 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా... 9 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 128 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

news18-telugu
Updated: April 2, 2020, 10:00 PM IST
తెలంగాణలో 154కి పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే 27
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
తెలంగాణ కరోనావైరస్ విజృంభిస్తోంది. ఢిల్లీలో తబ్లీఘీ జమాత్ సదస్సుకు వెళ్లొచ్చిన వారిలో చాలా మందికి వైరస్ సోకవడంతో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 27 పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కోవిడ్-19 నుంచి కోలుకొని ఇవాళ మరో ముగ్గురు కోలుకున్నారు. ఇవాళ సంగారెడ్డిలో ఆరు, నల్గగొండలో ఆరు, ములుగులో 2 కేసులు నమోదవగా.. మిగతా కేసుల వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా తెలంగాణలో ఇప్పటి వరకు 154 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 17 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా... 9 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 128 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.


తెలంగాణలో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండడంతో వారిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే చాలా మందిని గుర్తించిన అధికారులు.. వారితో పాటు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో కేసులు బయటపడుతున్నాయి. వారు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అనే వివరాలను సేకరించి వారి కూడా క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఇక రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని ప్రజలను హెచ్చరిస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మరోసారి స్పష్టం చేశారు.

First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading