కేరళలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఇప్పుడు కొత్త టెన్షన్

ప్రతీకాత్మక చిత్రం

మరో నాలుగైదు రోజుల్లో కేరళలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మళ్లీ అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

  • Share this:
    కేరళకు కొత్త టెన్షన్ మొదలయింది. మొన్నటి వరకు ఒకటి రెండు మాత్రమే నమోదయ్యే కొత్త కేసులు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గురువారం కేరళలో 26 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో ముగ్గురు పేషెంట్లు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐతే బుధవారం 10 కేసులు రాగా.. ఇవాళ ఏకంగా 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో సగం మంది విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని సీఎం పినరయి విజయన్ తెలిపారు. తాజా లెక్కలతో కేరళలో మొత్తం కేసుల సంఖ్య 560కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 493 మంది కోలుకోగా.. ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం కేరళలో 64 యాక్టివ్ కేసులున్నాయి.

    దేశంలో మొదటగా కేరళలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. ఐనప్పటికీ పటిష్ట వ్యూహంతో కరోనాను కట్టడి చేసింది కేరళ ప్రభుత్వం. మరణాల సంఖ్య కూడా అతి తక్కువగా ఉంది. అంతేకాదు బాధితులు కూడా కోలుకొని ఇళ్లకు వెళ్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో కేరళలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మళ్లీ అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రత్యేక విమానాలు, రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉన్న మలయాళీలు స్వస్థలాలకు చేరుకుంటున్నారని.. వారికి పరీక్షలు చేయడంతో కొత్త కేసులు బయటపడుతున్నాయని అధికారులు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: