మహారాష్ట్రలో మరణ మృదంగం.. ఒక్కరోజే 103 మంది మృతి

బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో ఇప్పటి వరకు 42,216 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1368 మంది మరణించారు.

news18-telugu
Updated: June 2, 2020, 10:56 PM IST
మహారాష్ట్రలో మరణ మృదంగం.. ఒక్కరోజే 103 మంది మృతి
బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో ఇప్పటి వరకు 42,216 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1368 మంది మరణించారు.
  • Share this:
మహారాష్ట్రపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మంగళవారం కూడా భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,287 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవాళ 1,225 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 103 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 72,300కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 31,333 మంది కోలుకోగా..2,465 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 38,493 యాక్టిక్ కరోనా కేసులున్నాయి.


ఇక మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. సోమవారం మరో 1109 కరోనా కేసులు నమోదవగా..49 మంది మరణించారు. తాజా లెక్కలతో బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) పరిధిలో ఇప్పటి వరకు 42,216 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1368 మంది మరణించారు.
First published: June 2, 2020, 10:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading