తమిళనాడులో కరోనా కల్లోలం.. 40వేలు దాటిన కరోనా కేసులు..

ప్రస్తుతం తమిళనాడులో 18,281 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మనదేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే అత్యధిక మంది కరోనా బారినపడ్డారు.

news18-telugu
Updated: June 12, 2020, 7:07 PM IST
తమిళనాడులో కరోనా కల్లోలం.. 40వేలు దాటిన కరోనా కేసులు..
24 గంటల వ్యవధిలో ఏపీలో 70993 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు. మొత్తం టెస్టులు 42,37,070
  • Share this:
తమిళనాడులో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,982 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 1,342 మంది మంది కరోనా బాధితులు డిశ్చార్జి కాగా.. మరో 18 మంది మరణించారు. తాజా లెక్కలతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 40,698కి చేరింది. కరోనా వైరస్‌తో పోరాడుతూ ఇప్పటి వరకు 22,047 మంది కోలుకోగా.. 326 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 18,281 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మనదేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే అత్యధిక మంది కరోనా బారినపడ్డారు.


కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 10,956 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 396 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 297,535కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 147,195 మంది కోలుకోగా.. 8,498 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 141,842 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: June 12, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading