తమిళనాడుపై కరోనా పంజా.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు

ప్రతీకాత్మక చిత్రం

బుధవారం తమిళనాడులో 1,008 మంది మంది కరోనా బాధితులు డిశ్చార్జి కాగా.. మరో 19 మంది మరణించారు.

  • Share this:
    తమిళనాడులో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. బుధవారం భారీ మొత్తంలో కొత్త కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,927 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 1,008 మంది మంది కరోనా బాధితులు డిశ్చార్జి కాగా.. మరో 19 మంది మరణించారు. తాజా లెక్కలతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 36,841కి చేరింది. కరోనా వైరస్‌తో పోరాడుతూ ఇప్పటి వరకు 19,333 మంది కోలుకోగా.. 326 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 17,179 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


    కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 276583కి చేరింది. మరో 279 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7745కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సోకిన ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు. తాజా లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 5991 మంది కోలుకున్నారు. అందువల్ల కోలుకున్న వారి సంఖ్య 135205కి చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశాల్లో ఇండియా ఆరో స్థానంలో ఉంది
    Published by:Shiva Kumar Addula
    First published: