Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS 1879 NEW COVID CASES REPORTED IN TELANGANA TODAY SK

తెలంగాణలో 27వేలు దాటిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 16,287 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 313 మంది మరణించారు.

    తెలంగాణలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. మంగళవారం కూడా భారీగా కొత్త కేసులు బయటపడ్డాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,879 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో ఏడుగురు మరణించారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో 1,422, రంగారెడ్డిలో 176, మేడ్చల్‌లో 94, కరీంనగర్‌లో 32, నల్గొండలో 31 నిజామాబాద్‌లో 19 కేసులు నమోదయ్యాయి. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 16,287 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

    రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 313 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 11,012 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 6,220 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,341 మందికి నెగెటివ్ వచ్చింది. 1879 మందికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఇప్పటి వరకు 1,28,438 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

    జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:
    వైద్యఆరోగ్యశాఖ ప్రకటన


    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana, Telangana News

    తదుపరి వార్తలు