హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తెలంగాణలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 169 కొత్త కేసులు నమోదయ్యాయి.

  తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం కూడా భారీ మొత్తంలో కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 169 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 82, రంగారెడ్డిలో 14, మెదక్‌లో ఇద్దరు, సంగారెడ్డిలో ఇద్దరి (మొత్తం 100 మంది)కి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు విదేశాల నుంచి వారిలో 64 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది.

  తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,425 (తెలంగాణ లోపలి కేసులు 2008+ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులు 417)కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 1381 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 71 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 973 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

  కరోనా హెల్త్ బులెటిన్

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Corona, Coronavirus, GHMC, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు