ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా .. ఒక్క రోజే 6566 కొత్త కేసులు..

ఫ్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వారం నుంచి రోజుకు 6 వేల కేసులకు తగ్గకుండా నమోదవుతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో 6,566 కొత్త కేసులు నమోదయ్యాయి.

  • Share this:
    కరోనా వైరస్ దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వారం నుంచి రోజుకు 6 వేల కేసులకు తగ్గకుండా నమోదవుతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో 6,566 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,333 కు చేరుకుంది. ప్రస్తుతం 86,110 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 67691 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అటు.. మొత్తం 4,531 మంది కరోనాతో చనిపోయారు. ఇక.. రాష్ట్రాల విషయానికి వస్తే మహారాష్ట్రలో మొత్తం 56,948, తమిళనాడులో 18,545, ఢిల్లీలో 15,257, గుజరాత్‌లో 15,195, రాజస్థాన్‌లో 7,703, మధ్యప్రదేశ్‌లో 7,261, ఉత్తర ప్రదేశ్‌లో 6,991, పశ్చిమబెంగాల్‌లో 4,192, ఆంధ్రప్రదేశ్‌లో 3,171, బిహార్‌లో 3,061, కర్ణాటకలో 2,418, పంజాబ్‌లో 2,139, తెలంగాణలో 2,098, జమ్మూ కశ్మీర్‌లో 1,921, ఒడిసాలో 1,593, హరియాణాలో 1,381, కేరళలో 1,004, అసోంలో 781, ఉత్తరాఖండ్‌లో 469, జార్ఖండ్‌లో 448, ఛత్తీస్‌గఢ్‌లో 369, ఛండీగఢ్‌లో 279, హిమాచల్ ప్రదేశ్‌లో 273, త్రిపురలో 230, గోవాలో 68, లడఖ్‌లో 53, పుదుచ్చేరిలో 46, మణిపూర్‌లో 44, అండమాన్ నికోబార్ దీవుల్లో 33, మేఘాలయాలో 20, నాగాలాండ్‌లో 4, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, దాద్రానగర్ హవేలీలో 2, మిజోరంలో 1, సిక్కింలో 1 కేసు నమోదయ్యాయి.
    కరోనా వివరాలు..
    Published by:Shravan Kumar Bommakanti
    First published: