మహారాష్ట్రలో 30వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 29,100కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6564 మంది కోలుకోగా.. 1068 మంది మరణించారు.

news18-telugu
Updated: May 15, 2020, 8:50 PM IST
మహారాష్ట్రలో 30వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. గురువారం భారీ మొత్తంలో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1576 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 49 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 29,100కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6564 మంది కోలుకోగా.. 1068 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 21,467 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే.


మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబైలో 933 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 34 మంది చనిపోయారు. తాజా కేసులతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,512కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 655 మంది మరణించారు.
First published: May 15, 2020, 8:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading