ఏపీలో 23 వేలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే...

ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 277 మంది చనిపోయారు.


Updated: July 9, 2020, 1:57 PM IST
ఏపీలో 23 వేలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా మీడియా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,555 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 1500 కేసులు ఏపీ లోపల నమోదవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 53, విదేశాల నుంచి వచ్చిన వారు ఐదుగురు ఉన్నారు. ఇక 904 మంది డిశ్చార్జి అవగా.. మరో 13 మంది మరణించారు. కర్నూలులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయారు.

తాజా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 277 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 11,383 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో 16,882 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,500 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఏపీలో ఇప్పటి వరకు 10,94,615 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కరోనా కేసులు

Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 1:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading