Telangana Covid-19: తెలంగాణలో 36వేలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 11,525 శాంపిల్స్‌ను పరీక్షించారు. 9,975 మందికి కరోనా నెగెటివ్ రాగా.. 1,550 పాజిటివ్ కేసులు వచ్చాయి

news18-telugu
Updated: July 13, 2020, 10:02 PM IST
Telangana Covid-19: తెలంగాణలో 36వేలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం.. సోమవారం 1,550 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 926 మంది కరోనా బారినపడ్డారు. ఇవాళ 1,197 మంది డిశ్చార్జి అవగా.. మరో 9 మంది మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,221కి చేరింది. వీరిలో కరోనా నుంచి 23,679 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 12,178 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 11,525 శాంపిల్స్‌ను పరీక్షించారు. 9,975 మందికి కరోనా నెగెటివ్ రాగా.. 1,550 పాజిటివ్ కేసులు వచ్చాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,81,849 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. అటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,191 కోవిడ్ ఐసోలేషన్ బెడ్స్, 2,804 ఆక్సీజన్ బెడ్స్, 1,242 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 15,237 (89.2 శాతం) పడకలు ఖాళీగా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:
తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్
Published by: Shiva Kumar Addula
First published: July 13, 2020, 9:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading