వెయ్యికి చేరువలో మృతుల సంఖ్య.. మహారాష్ట్రలో మరణ మృదంగం

గడిచిన 24 గంటల్లో ముంబైలో 596 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది చనిపోయారు.

news18-telugu
Updated: May 13, 2020, 8:35 PM IST
వెయ్యికి చేరువలో మృతుల సంఖ్య.. మహారాష్ట్రలో మరణ మృదంగం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనావైరస్ విలయ తాండవం చేస్తోంది. బుధవారం కూడా భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1495 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 54 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 25,922కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,547 మంది కోలుకోగా.. 975 మంది మరణించారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబైలో 596 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది చనిపోయారు. తాజా కేసులతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15747కి చేరింది. ఇప్పటి వరకు 596 మంది మరణించారు.


అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,525 కొత్త కేసులు నమోదవగా.. 122 మంది మరణించారు. మనదేశంలో ఇప్పటి వరకు 74,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 24,386 మంది కోలుకోగా.. 2,415 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 47,480 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
First published: May 13, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading