మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు...

ముంబైలోని ధారవి మురికివాడలో ఇవాళ 50 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు మొత్తం 783 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: May 7, 2020, 10:23 PM IST
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1362 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 43 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది.


ఇక ముంబైలోని ధారవి మురికివాడలో ఇవాళ 50 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు మొత్తం 783 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా, గురువారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3,561 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 52,952 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 1,783 మరణాలు నమోదయ్యాయి. 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,084 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 15,267 మంది కోలుకున్నారు.
First published: May 7, 2020, 8:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading