తెలంగాణలో ఇవాళ 1,213 కరోనా పాజిటివ్ కేసులు.. ప్రగతి భవన్‌లోనూ..

గడిచిన 24 గంటల్లో 5,356 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 4,143 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 1,213 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

news18-telugu
Updated: July 2, 2020, 10:17 PM IST
తెలంగాణలో ఇవాళ 1,213 కరోనా పాజిటివ్ కేసులు.. ప్రగతి భవన్‌లోనూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. గురువారం కూడా భారీగా కొత్త కేసులు బయటపడ్డాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,213మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 987 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. మరో 8 మంది మరణించారు. గురువారం హైదరాబాద్ పరిధిలో 998, మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్‌లో 10, వరంగల్ అర్బన్‌లో 9, నల్గొండలో 8, భద్రాద్రిలో 7, సిరిసిల్లలో 6, కరీంనగర్‌లో 5, నిజామాబాద్‌లో 5, ములుగు, నిర్మల్‌లో 4 చొప్పున, నారాయణపేట, కామారెడ్డిలో 2 చొప్పున, గద్వాల్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

గురువారం ప్రగతి భవన్, సీఎం క్యాంప్ ఆఫీసులో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 9,069 మంది డిశ్చార్జి కాగా.. 275 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 5,356 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 4,143 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 1,213 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 98,153 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.
వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన
First published: July 2, 2020, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading