హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా.. 12 మందికి పాజిటివ్

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా.. 12 మందికి పాజిటివ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇప్పటి వరకు 2,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 434 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు.

  తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు సుమారం వంద కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. తాజాగా కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా తీవ్ర కలలకం రేపింది. 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఉస్మానియాలో మొత్తం 296 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులంతా హాస్టల్‌లో ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఐతే హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై 180 మంది విద్యార్థినులు, 116 మంది విద్యార్థులకు పరీక్షలు చేయించారు. వీరిలో 12 మందికి పాజిటివ్ వచ్చింది. మరికొందరు విద్యార్థుల రిపోర్టులు రావాల్సి ఉంది.

  5 రోజుల క్రితం ఓయూ వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఖండించారు.

  కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 2,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 434 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. రాష్ట్రం నమోదైన మొత్తం కేసుల్లో.. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ 1491 మంది కోలుకున్నారు. 88 మంది మరణించారు. ప్రస్తుతం 1213 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, భద్రాద్రి, అసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు