Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    తమిళనాడుపై కరోనా పంజా.. ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు

    తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 24,586కి చేరింది. కరోనా వైరస్‌తో పోరాడుతూ ఇప్పటి వరకు 13,706 మంది కోలుకోగా.. 197మంది మరణించారు.

    news18-telugu
    Updated: June 2, 2020, 10:53 PM IST
    తమిళనాడుపై కరోనా పంజా.. ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు
    ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 12,285 మంది కోవిడ్ 19 బారిన పడ్డారు. వారిలో 6648 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 5480 మంది డిశ్చార్జ్ అయ్యారు. 157 మంది ప్రాణాలు కోల్పోయారు.
    • Share this:
    తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1091 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ 536 మంది మంది కరోనా బాధితులు డిశ్చార్జి కాగా.. 13 మంది మరణించారు. తాజా లెక్కలతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 24,586కి చేరింది. కరోనా వైరస్‌తో పోరాడుతూ ఇప్పటి వరకు 13,706 మంది కోలుకోగా.. 197మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 10,680 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

    కాగా,కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 1,98,706 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 93,323 ఉండగా, 91,818 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా, 5,394 మంది వ్యాధితో మరణించారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ఆ తర్వాత తమిళనాడు(23,495), ఢిల్లీ(20,834), గుజరాత్(17,200) ఉన్నాయి.
    Published by: Shiva Kumar Addula
    First published: June 2, 2020, 10:53 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading