మహారాష్ట్రలో 1,061 మంది పోలీసులకు కరోనా వైరస్

ఇప్పటికే 9 మంది పోలీసులు చనిపోగా... 174 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

news18-telugu
Updated: May 15, 2020, 3:05 PM IST
మహారాష్ట్రలో 1,061 మంది పోలీసులకు కరోనా వైరస్
ఇప్పటికే 9 మంది పోలీసులు చనిపోగా... 174 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
  • Share this:
మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలే కాదు.. డాక్టర్లు, పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,061 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 112 మంది అధికారి స్థాయి పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 9 మంది పోలీసులు చనిపోగా... 174 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గురువారం రాత్రి మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1602 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 44 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 27,524కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6059 మంది కోలుకోగా.. 1019 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 20,441 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే.

First published: May 15, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading