మహారాష్ట్రలో వెయ్యికి పైగా కొత్త కరోనా కేసులు నమోదు..

మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 24427కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 921 మంది మరణించారు.

news18-telugu
Updated: May 12, 2020, 9:41 PM IST
మహారాష్ట్రలో వెయ్యికి పైగా కొత్త కరోనా కేసులు నమోదు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారం కూడా భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1026 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 53 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 24427కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 921 మంది మరణించారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే.


మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబైలో 426 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 28 మంది చనిపోయారు. తాజా కేసులతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,781కి చేరింది. ఇప్పటి వరకు 556 మంది మరణించారు. ముంబై ఆస్పత్రుల నుంచి ఇప్పటి వరకు 3,312 మంది కోలుకున్నారు.

అటు, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,604 కొత్త కేసులు నమోదవగా.. 87 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,756కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 22,455 మంది కోలుకోగా.. 2,293 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 46,008 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
First published: May 12, 2020, 9:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading