Home /News /coronavirus-latest-news /

CORONAVIRUS 1018 NEW COVID CASES REPORTED IN TELANGANA SK

తెలంగాణలో ఇవాళ వెయ్యికిపైగా కొత్త కేసులు.. జిల్లాల వారీగా వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన 24 గంటల్లో 4,234 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,216 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 1,018 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

    తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. బుధవారం కూడా భారీగా కొత్త కేసులు బయటపడ్డాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,018 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 788 మంది డిశ్చార్జి కాగా.. మరో ఏడుగురు మరణించారు. బుధవారం హైదరాబాద్‌ పరిధిలో 881, మేడ్చల్‌లో 36, రంగారెడ్డిలో 33, మహబూబ్ నగర్ 10, వరంగల్ రూరల్, మంచిర్యాలలో 9 చొప్పున, ఖమ్మంలో 7, నల్గొండ, జగిత్యాలలో 4 చొప్పున, నిజామాబాద్‌లో 3, సిద్దిపేటలో 3, సంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, కామారెడ్డి, ములుగు, అసిఫాబాద్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రిలో 2 చొప్పున, గద్వాలలో ఒక్క కేసు నమోదయ్యాయి.

    తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 8,082 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా.. 267 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,008 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 4,234 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,216 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 1,018 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 92,797 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.
    వైద్యఆరోగ్యశాఖ ప్రకటన
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు