గుంటూరు జిల్లాలో మాస్క్ తప్పనిసరి.. లేదంటే రూ.1000 జరిమానా

మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి రూ. 1000 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: April 9, 2020, 9:48 PM IST
గుంటూరు జిల్లాలో మాస్క్ తప్పనిసరి.. లేదంటే రూ.1000 జరిమానా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రోజుకు కొత్తగా వందల సంఖ్యలో బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తూనే.. మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, యూపీ, మహాారాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు మాస్క్‌లను ధరించడం తప్పనిసరి చేశాయి. తాజాగా ఆ జాబితాలో ఏపీలోని గుంటూరు జిల్లా కూడా చేరిపోయింది. జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని కలెకర్ట్ శామ్యూల్ ఆనంద్ స్పష్టం చేశారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి రూ. 1000 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్.

నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు కార్యాలయాలకు చేరుకోవాలని స్సష్టం చేశారు. మళ్లీ సాయంత్రం 5 తర్వాత రహదారులపైకి రావాలన్నారు. పనివేళల్లో ఉద్యోగులను రోడ్ల మీదుకు అనుమతించేదని చెప్పారు గుంటూరు జిల్లా కలెక్టర్. కాగా, ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 363కి చేరింది. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా.. 10 మంది డిశ్చార్జి అయ్యారు. గుంటూరులో జిల్లా ఇప్పటి వరకు 51 మంది కరోనా బారినపడ్డారు. ఏపీలో కర్నూల్ (75) తర్వాత గుంటూరులోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు.
First published: April 9, 2020, 9:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading