#CoronaHaaregaIndiaJeetega: రిలయన్స్ దాతృత్వానికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రశంస...

(Image: Lokmat)

కరోనాపై పోరుకు స్పందనగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రత్యేక ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ టీమ్ కోవిడ్ 19పై పోరులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందని కొనియాడారు.

  • Share this:
    కరోనాపై పోరుకు స్పందనగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రత్యేక ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ టీమ్ కోవిడ్ 19పై పోరులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందని కొనియాడారు. ఈ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అలాగే రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు విరాళంగా ఇచ్చింది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అదనంగా 5 కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి PM-CARES నిధిని రూపొందించారు. ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పౌరులకు విజ్ఞప్తి చేశారు.



    ఇప్పటి వరకూ కరోనా కట్టడికి రిలయన్స్ చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు ఇవే..
    - పిఎం-కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్ల సహకారం
    - మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ .5 కోట్ల సహకారం
    - గుజరాత్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ .5 కోట్ల సహకారం
    - భారతదేశపు మొట్టమొదటి 100 పడకల ప్రత్యేకమైన COVID-19 హాస్పిటల్ కరోనావైరస్ రోగుల చికిత్సకు కేవలం రెండు వారాల్లో సన్నద్ధం చేయడం.
    - భారతదేశం అంతటా రాబోయే 10 రోజుల్లో 50 లక్షల ఉచిత భోజనం అందించడం, కొత్త ప్రాంతాల్లో ఇలాంటి భోజనాన్ని అందించే ప్రణాళికలు సిద్ధం చేయడం.- ఆరోగ్య కార్యకర్తలు, మెడికల్ సిబ్బందికి రోజూ లక్ష మాస్కుల తయారీకి రంగం సిద్ధం.
    - ఆరోగ్య కార్యకర్తల, ఇతర వైద్య సిబ్బందికి ప్రతిరోజూ వేలాది వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) సమకూర్చడం.
    - దేశవ్యాప్తంగా నోటిఫైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు ఉచిత ఇంధనం సదుపాయరం కల్పించడం.
    - జియో తన టెలికాం ద్వారా రోజూ దాదాపు 40 కోట్ల మంది వ్యక్తులు అలాగే వేలాది సంస్థలను ‘ఇంటి నుండి పని’, ‘ఇంటి నుండి అధ్యయనం’, ‘ఇంటి నుండి ఆరోగ్యం’ సజావుగా సాగేలా నాణ్యమైన సేవలు అందించడం.
    - రిలయన్స్ రిటైల్ దుకాణాలు ద్వారా లక్షలాది మంది భారతీయులకు రోజువారీ అవసరమైన సామాగ్రిని అందిస్తుంది
    - తమ సంస్థలో పనిచేసే ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని రిలయన్స్ స్పష్టం చేసింది.
    Published by:Krishna Adithya
    First published: