పెద్దపల్లి జిల్లాకు పాకిన కరోనా... తొలి పాజిటివ్ కేసు నమోదు

తెలంగాణ రికార్డైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరింది. చనిపోయిన వారి సంఖ్య 11కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకొని తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 32 మంది బయటపడ్డారు.

news18-telugu
Updated: April 3, 2020, 11:02 PM IST
పెద్దపల్లి జిల్లాకు పాకిన కరోనా... తొలి పాజిటివ్ కేసు నమోదు
ప్రతీకాత్మక చిత్రం(credit - NIAID)
  • Share this:
తెలంగాణలో కరోనా మహమ్మారి జిల్లాలకూ విస్తరిస్తోంది. తాజాగా పెద్దపెల్లి జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎన్టీపీసీకి చెందిన ఒకరికి కరోన పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్టిపిసి లోని అన్నపూర్ణ కాలనీ తో పాటు పరిసర ప్రాంతాల్లో అధికారులు రక్షణ చర్యలు ప్రారంభించారు. కాలనీల్లో బ్లీచింగ్ నిర్వహిస్తున్నారు. గోదావరిఖనిలో తొలి కేసు నమోదు కావడంతో కార్మిక ప్రాంతంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోన సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు బంధువులను ఇప్పటికే అధికారులు క్వారెంటీన్ కేంద్రానికి తరలించిన, వ్యాధిగ్రస్తుడు సన్నిహితంగా ఉన్న వారికోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. తొలి కేసు నమోదు కావడంతో పెద్దపెల్లి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం నుండి జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినంగా చేపట్టాలని నిర్ణయించారు..

ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. షాద్‌నగర్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇవాళ 15 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన రాత్రి 7 గంటల కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో రికార్డైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరింది. చనిపోయిన వారి సంఖ్య 11కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకొని తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 32 మంది బయటపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం 186 కరోనా యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ ప్రభుత్వ ప్రకటించింది.

First published: April 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading