Corona World : 33 లక్షల కేసులు.. 2.3 లక్షల మరణాలు..

Coronavirus : రోజుకు లక్ష కొత్త కేసులతో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిన్న 32 లక్షలు ఉన్న పాజిటివ్ కేసులు ఒక్క రోజులోనే మరో లక్ష దాటింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 33,04,381 వద్ద కొనసాగుతోంది.

news18-telugu
Updated: May 1, 2020, 6:22 AM IST
Corona World : 33 లక్షల కేసులు.. 2.3 లక్షల మరణాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Coronavirus : రోజుకు లక్ష కొత్త కేసులతో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిన్న 32 లక్షలు ఉన్న పాజిటివ్ కేసులు ఒక్క రోజులోనే మరో లక్ష దాటింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 33,04,381 వద్ద కొనసాగుతోంది. అటు.. మరణాల సంఖ్య కూడా 2,33,839కు చేరింది. ఆశాజనకంగా 10,39,144 మంది వైరస్‌ను ఎదురించి నిలబడ్డారు. వీరంతా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 50,947 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక.. అమెరికాపై కరోనా పంజా విసురుతూనే ఉంది. రోజుకు కనీసం రెండు వేల మందిని బలి తీసుకోకుండా ఉండటం లేదు. నిన్న ఒక్క రోజే 2,201 మందిని చంపేసింది. మొత్తంగా అమెరికాలోనే 63,856 మంది కరోనా రక్కసి బారిన పడి మృతి చెందారు. కాగా, నిన్న ఒక్క రోజే 30 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అటు.. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 11 లక్షలకు చేరింది.

ఇదిలా ఉండగా, యూకేలో 674, బ్రెజిల్‌లో 390, ఫ్రాన్స్‌లో 289, ఇటలీలో 285, స్పెయిన్‌లో 268, కెనడాలో 188, మెక్సికోలో 163, జర్మనీలో 156, స్వీడన్‌లో 124, పెరూలో 108, రష్యాలో 101 మంది మృతిచెందారు. షాకింగ్ విషయం ఏంటంటే.. తాజాగా రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్టిన్‌ కరోనా బారినపడ్డారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చిది. గురువారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మిఖైల్ మిషుస్టిన్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రపంచవ్యాప్త కరోనా గణాంకాలు :

మొత్తం కేసులు : 33,04,381
మరణాలు : 2,33,839
కోలుకున్నవారు : 10,39,144
యాక్టివ్ కేసులు : 20,31,398సీరియస్ కేసులు : 50,947
First published: May 1, 2020, 6:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading