గర్భిణులకు కరోనా వస్తే.. పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి ?

గర్భిణులకు కరోనా వస్తే.. పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమిటి ?

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్-19 బారిన పడిన గర్భిణుల నుంచి నవజాత శిశువుకు కరోనా వ్యాపించే అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై నిపుణులు పరిశోధన చేశారు.

  • Share this:
కరోనా మహమ్మారిపై జరుగుతున్న పరిశోధనల్లో రోజురోజుకీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా చిన్న పిల్లలకు, మహిళలకు పెద్దగా ప్రమాదం ఉండదని కొన్ని అధ్యయనాలు ప్రకటించాయి. తాజాగా కోవిడ్-19 సోకిన గర్భిణుల వల్ల పుట్టబోయే పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఉండదని మరో అధ్యయనం వెల్లడించింది. నవజాత శిశువులకు కరోనా సోకే అవకాశాలు తక్కువని ఆ పరిశోధన తెలిపింది.

తల్లి పాలు పట్టించినా ప్రమాదం లేదు
కోవిడ్-19 బారిన పడిన గర్భిణుల నుంచి నవజాత శిశువుకు కరోనా వ్యాపించే అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై నిపుణులు పరిశోధన చేశారు. ప్రసవం అనంతరం పిల్లలు కరోనావైరస్ బారిన పడలేదని వారు కనుగొన్నారు. శిశువులకు తల్లిపాలు పట్టించినా, అదే ఆసుపత్రిలో ఒకే గదిలో తల్లీబిడ్డలను ఉంచినా శిశువులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండవని అధ్యయన బృందం ప్రకటించింది.

డెలివరీ గడువు తగ్గింది
JAMA పీడియాట్రిక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేశారు. తీవ్రమైన కోవిడ్-19 లక్షణాలు ఉన్న గర్భిణులకు ఒక వారం ముందుగానే డెలివరీ అవుతోందని వారు గ్రహించారు. ఇలా పుట్టిన పిల్లలకు కామెర్లు సోకకుండా చేసే ఫోటోథెరపీ చికిత్స అవసరం మిగతా పిల్లలో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ అని వారు తేల్చారు.

వేరుచేయాల్సిన అవసరం లేదు
పరిశోధనలో భాగంగా కరోనా సోకిన 101మంది తల్లులను, వారికి పుట్టిన శిశువులను చిన్నపిల్లల వైద్యులు పరీక్షించారు. కోవిడ్-19 వచ్చినంత మాత్రాన బాధిత తల్లులను, నవజాత శిశువులను వేరుచేయాల్సిన అవసరం లేదని అధ్యయన బృందం చెబుతోంది. ఆ శిశువులకు తల్లిపాలను పట్టించడం సురక్షితమేనని వారు తెలిపారు.

శిశువులకు ప్రమాదం తక్కువే
గతంలో యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా గర్భిణులకు కొన్ని సూచనలు ఇచ్చింది. కోవిడ్-19 సోకిన గర్భిణులు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆ సంస్థ తెలిపింది. కరోనా వైరస్ బారిన పడిన మహిళల్లో ముందస్తు ప్రసవం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని సీడీఎస్ ప్రకటించింది. దీనికి సంబంధించి జూన్లో కొన్ని గణాంకాలను సైతం సీడీఎస్ విడుదల చేసింది. కానీ ఇప్పటివరకు కోవిడ్-19 సోకిన తల్లల పిల్లలకు వైరస్ నుంచి ప్రమాదం ఉన్నట్లు ఎలాంటి పరిశోధనలూ ధ్రువీకరించలేదు.
Published by:Kishore Akkaladevi
First published:

అగ్ర కథనాలు