హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్.. దీని గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

Omicron: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్.. దీని గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron Variant: జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా వంటి నగరాలు ఉన్న గౌటెంగ్ ప్రావిన్స్‌లో B.1.1.529 వేరియంట్ వ్యాప్తి వేగంగా పెరిగిందని NGS-SA గురువారం వెల్లడించింది. ఇప్పటికే చాలా ప్రావిన్సులకు ఇది వ్యాపించి ఉండవచ్చని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతోందని భావిస్తున్న వేళ.. మరో కొత్త వేరియంట్ (Corona new variant) ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం మరో కొత్త SARS-CoV-2 వేరియంట్‌ను గుర్తించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వ్యాప్తిచెందుతున్న ఈ వేరియంట్‌ను 'ఆందోళనకరమైన వేరియంట్'గా (variant of concern) వర్గీకరించింది. దీనికి ఒమిక్రాన్ (Omicron) అని పేరు కూడా పెట్టింది. సౌత్ ఆఫ్రికాలోని నెట్‌వర్క్ ఫర్ జెనోమిక్స్ సర్వైలెన్స్ (NGS-SA) సంస్థ సోమవారం ఈ వేరియంట్‌ను గుర్తించింది. B.1.1.529 జినోమ్ కోడ్‌ ఉన్న ఈ వేరియంట్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో వ్యాక్సిన్‌లు ఈ కొత్త వేరియంట్‌పై తక్కువ ప్రభావవంతంగా పనిచేయవచ్చని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Corona Updates: భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త వేరియెంట్ వణికిస్తున్న వేళ నిజంగా ఊరటే

B.1.1.529 వేరియంట్‌లో మల్టిపుల్ స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్లు ఉన్నాయి. ఇవి వేగంగా వ్యాపించగల లక్షణాన్ని సూచిస్తున్నాయి. గత రెండు వారాల్లో దక్షిణాఫ్రికాలో కొత్త కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా వంటి నగరాలు ఉన్న గౌటెంగ్ ప్రావిన్స్‌లో B.1.1.529 వేరియంట్ వ్యాప్తి వేగంగా పెరిగిందని NGS-SA గురువారం వెల్లడించింది. ఇప్పటికే చాలా ప్రావిన్సులకు ఇది వ్యాపించి ఉండవచ్చని పేర్కొంది.

* కొత్త వేరియంట్ ఎందుకు ప్రమాదకరం?

కొత్త B.1.1.529 వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో 30 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్ల కంటే రెట్టింపు కావడం గమనార్హం. అందుకే ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ, శరీర కణాలకు అంటుకుంటూ, ప్రమాదకరంగా మారగలదని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ఇది మరో కోవిడ్ ఉద్ధృతికి కారణం కావచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Omicron: ఒమిక్రాన్ వేరియెంట్.. అత్యంత ఘోరమైన వైరస్.. 2 డోసుల టీకా వేసుకున్నా వదలదా?

ఈ వేరియంట్‌లోని కొన్ని మ్యుటేషన్లు ఇతర ఆందోళనకర వేరియంట్ల కంటే మరింత శక్తిమంతంగా ఉన్నాయి. వీటి కారణంగా కొత్త వేరియంట్ రోగనిరోధకకు లొంగకుండా వేగంగా వ్యాపించగలదని తేలింది. దీంట్లోని కొన్ని మ్యుటేషన్లను ఇప్పటికే ఆల్ఫా, డెల్టా వేరియంట్‌లలో కనుగొన్నారు. కానీ కొన్ని అరుదైన మ్యుటేషన్లను సైతం పరిశోధకులు గుర్తించారు. వీటిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు NGS-SA తెలిపింది. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావాన్ని, రోగనిరోధక ప్రతిస్పందనను గుర్తించడానికి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) తెలిపింది.

* ఈ వేరియంట్ మ్యుటేషన్లలో ఆందోళనకు కారణమయ్యేవి ఏవి?

కొత్త వేరియంట్‌లో గుర్తించిన H655Y + N679K + P681H మ్యుటేషన్ల సమూహానికి మరింత సమర్థవంతంగా మానవ శరీర కణాలకు అంటుకునే సామర్థ్యం ఉన్నట్లు NGS-SA తెలిపింది. అంటే వీటి కారణంగా వైరస్ వేగంగా వ్యాపించడంతో పాటు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్ఫా, బీటా, గామా, లాంబ్డా వేరియంట్‌లలో ఉన్న nsp6 అనే మ్యుటేషన్ కూడా కొత్త వేరియంట్‌లో ఉంది. దీంట్లో R203K+G204R ఉత్పరివర్తనాలు సైతం ఉన్నాయి. ఇవి ఆల్ఫా, గామా, లాంబ్డాలో కూడా కనిపించాయి. ఈ మ్యుటేషన్లు అన్నీ ఇన్‌ఫెక్షన్ పెరుగుదలను సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌కు సంబంధించి 100 కంటే తక్కువ జీనోమ్ సీక్వెన్సులు అందుబాటులో ఉన్నాయని WHO ప్రకటించింది. దీని వ్యాప్తి, ప్రభావం, మ్యుటేషన్ల స్వభావం గురించి తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు ప్రకటింది.

* దీని లక్షణాలు భిన్నంగా ఉంటాయా?

B.1.1.529 వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి అసాధారణ లక్షణాలను గుర్తించలేదని దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) తెలిపింది. డెల్టా వంటి ఇతర ఆందోళన రకం వేరియంట్‌ల మాదిరిగానే కొంతమందిలో ఎలాంటి లక్షణాలు లేవని, కొందరిలో తక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని సంస్థ వెల్లడించింది.

New Covid Variant: ఎయిడ్స్ రోగి నుంచి కరోనా కొత్త వేరియెంట్.. మరో ముప్పు పొంచి ఉందా?

* వ్యాక్సిన్ ప్రభావం, వ్యాధి తీవ్రతను శాస్త్రవేత్తలు ఎలా నిర్ణయిస్తారు?

ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి ఎపిడెమియోలాజికల్, క్లినికల్ కోరిలేషన్‌ను శాస్త్రవేత్తలు పూర్తిగా ఆవిష్కరించలేదు. ఈ ప్రక్రియ పూర్తి కాకుండా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ప్రభావం, వ్యాధి తీవ్రతను అంచనా వేయలేరు. దక్షిణాఫ్రికా చేపట్టిన ప్రయోగాల్లో, B.1.1.529 రోగనిరోధకతను తప్పించుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇది ప్రస్తుత వ్యాక్సిన్‌ల పనితీరును కూడా సూచిస్తుంది. ఆసుపత్రిలో చేరడంతో పాటు B.1.1.529తో సంబంధం ఉన్న ఫలితాలను పర్యవేక్షించడానికి రియల్ టైమ్ సిస్టమ్‌ను ఆ దేశం ఏర్పాటు చేసింది. మ్యుటేషన్ తీవ్రత, ఔషధాల పనితీరుపై ప్రభావం వంటి వివరాలను ఈ డేటా ద్వారా విశ్లేషించవచ్చు.

* RT-PCR పరీక్షలతో కొత్త వేరియంట్‌ని సులభంగా గుర్తించవచ్చా?

దక్షిణాఫ్రికా NICD ప్రకారం.. B.1.1.529 రూపాంతరాన్ని వేగంగా గుర్తించడానికి తోడ్పడే S జన్యువులో మార్పులు ఉన్నాయి. అయితే మార్పులతో పెద్దగా ప్రభావితం కాని N, RdRp వంటి ఇతర జన్యువుల సాయంతో 100 కంటే ఎక్కువ నమూనాలను పరిశోధకులు పరీక్షించారు. ఈ డేటా విశ్లేషణ ద్వారా PCR పరీక్ష సున్నితత్వం ప్రభావితం అయ్యే అవకాశం లేదని పరిశోధకులు గుర్తించారు.

కరోనాలో మరో భయంకరమైన వేరియెంట్.. అసాధారణ రీతిలో మ్యుటేషన్లు

* ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా బారిన పడే ప్రమాదం ఉన్న సమూహాలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయడం ద్వారా కొత్త వేరియంట్ ఇన్‌ఫెక్షన్‌ను కట్టడి చేయవచ్చు. ఇతర అనారోగ్యాలకు గురైన బాధితులను రక్షించే చర్యలు చేపట్టాలి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఫేస్ మాస్కులు ధరించడం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇతర కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

First published:

Tags: Coronavirus, Covid-19, Omicron corona variant, South Africa

ఉత్తమ కథలు